యూనిట్
Flash News
అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో
ఆదివారం71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా
జరిగాయి. జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు జాతీయ పతాకాన్ని ఎగుర వేసి సిబ్బందికి గణతంత్ర
దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎందరో
మేధావులు, త్యాగధనుల కృషి ఫలితమే మనకు 1950 జనవరి 26 న అతి పెద్ద రాజ్యాంగం ఏర్పడిందన్నారు. అప్పటి నుంచీ ప్రతీ ఏటా
ఈరోజున మనం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. పోలీసు సిబ్బంది
సమిష్టిగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ జి.రామాంజినేయులు,
స్పెషల్
బ్రాంచి డిఎస్పీ ఎ. రామచంద్ర, ఏ.ఆర్
డీఎస్పీ ఎన్ మురళీధర్ , ఇన్స్పెక్టర్లు బి.వి శివారెడ్డి, శ్రీరాం, ఆర్ ఐ పెద్దయ్య, పలువురు
ఎస్ ఐ లు, ఆర్ ఎస్ ఐ లు, జిల్లా పోలీసు కార్యాలయం
పరిపాలనాధికారి శంకర్ , వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.