యూనిట్

ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

జిల్లా ఎస్‌.పి. అభిషేక్‌ మహంతి ఆదేశాల మేరకు అదనపు ఎస్‌.పి. బి.లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో మైదుకూరు సబ్‌డివిజన్‌లోని మైదుకూరు-పోరుమామిళ్ళ రోడ్డులోని ఎర్రచెరువు క్రాస్‌ రోడ్డు వద్ద ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న నిందితులను అరెస్టుచేసినట్లు అదనపు ఎస్‌.పి. తెలిపారు. వారినుంచి 3.3 టన్నుల ఎర్రచందనం, ఒక లారీ, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పట్టుబడిన నిందితులు పశ్చిమబెంగాల్‌కు చెందిన రాణా దత్తా, తమిళనాడుకు చెందిన ఉలగంధన్‌ వేలులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితులకు అంతర్‌రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు అదనపు ఎస్‌.పి. తెలిపారు. అక్రమంగా తరలించే దుంగలను ఓ గౌడౌన్‌లో ఉంచి అక్కడినుంచి విడతలవారీగా విక్రయించేవారని తెలిపారు. ముఠాను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన టాస్క్‌ఫోర్స్‌ సీఐ టీవీ సత్యనారాయణ, ఎస్‌ఐ సుబ్బారావు, సిబ్బంది శివరామ్‌నాయుడు, సుధాకర్‌, రమణ, సురేష్‌, కొండయ్య, గోపినాయక్‌, సుబ్రమణ్యం, రాకేష్‌, ప్రసాద్‌బాబు, రాజేష్‌, చిన్నోడు, మైదుకూరు సిబ్బందిని అదనపు ఎస్‌.పి. బి.లక్ష్మినారాయణ అభినందించారు.

వార్తావాహిని