యూనిట్

ఎర్రచందనం దొంగలకు కఠిన శిక్ష

ఎర్రచందనం దొంగలకు కఠిన శిక్ష ఎర్రచందనం అక్రమాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులకు 11 సంవత్సరాలపాటు జైలు శిక్ష, జరిమానా విధించినట్లు రెడ్‌శాండర్స్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌చార్జి, ఎస్‌.పి. పి.రవిశంకర్‌ తెలిపారు. అనేక సంవత్సరాలుగా వీరు ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తూ.. వివిధ నేరాలకు పాల్పడుతున్నట్లు ఎస్‌.పి. తెలిపారు. వీరిని అరెస్టుచేసి, తిరుపతి సెషన్స్‌ కోర్టులో హాజరుపర్చగా సెక్షన్‌ 235(2) సెక్షన్‌ల కింద 11 సంవత్సరాలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.6లక్షల జరిమానాను న్యాయమూర్తి విధించినట్లు తెలిపారు. ఎన్నోఏళ్ళుగా పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకు తిరుగుతున్న వీరిని చాకచక్యంగా అరెస్టుచేసినట్లు తెలిపారు.

వార్తావాహిని