యూనిట్
Flash News
27 మంది మహిళా పోలీసులకు నియామక పత్రాలు

27 మంది గ్రామ/వార్డు మహిళా పోలీసు ఉద్యోగార్థులకు
పోస్టింగు ఆర్డర్లు అందజేశారు. జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాలుతో
కౌన్సెలింగ్ నిబంధనలు అనుసరించి అదనపు ఎస్పీ జి,రామాంజినేయులు వీరికి కోరుకున్న చోటుకు
పోస్టింగులు ఇచ్చారు. స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన
ఈకార్యక్రమానికి 30 మందిని పిలువగా
ఇందులో 27 మంది హాజరయ్యారు.
మెరిట్ ఆధారంగా ఎంపికైన వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు... ఆతర్వాత కౌన్సెలింగ్
నిర్వహించారు. పోస్టింగు కోరుకునే ఉద్యోగార్థి తన స్వగ్రామం/వార్డు ఉండే సచివాలయం
కాకుండా ఇతర సచివాలయాలకు కేటాయించారు. అంతేకాకుండా... ఖాళీగా ఉన్న సచివాలయాల
ఆప్షన్లను ప్రొజెక్టర్ డిస్ప్లేపై ఉంచి ఒక దానిని ఎంపిక చేసుకోమని ఉద్యోగార్థులకు
అవకాశమిచ్చారు. దీంతో ఉద్యోగార్థుల అభీష్టం మేరకు పోస్టింగు కేటాయించి
అక్కడికక్కడే పోస్టింగు ఆర్డర్లు అందజేశారు. ఈకార్యక్రమంలో జిల్లా పోలీసు
కార్యాలయం ఎ సూపరింటెండెంటు నిజాముద్దీన్ , సిబ్బంది పాల్గొన్నారు.