యూనిట్
Flash News
బాధితులకు భరోసా నివ్వండి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్పందన' కార్యక్రమానికి కడప జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లలో రిసెప్సనిస్టులను నియమించినట్లు అదనపు ఎస్.పి. బి.లక్ష్మినారాయణ అన్నారు. రిసెప్సనిస్టులకు ఒక రోజు శిఓణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులు ఎన్నో బాధలతో మనం ఉన్నామనే ధైర్యంతో వస్తారని వారి సమస్యలను సావధానంగా విని, వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. 'స్పందన' కార్యక్రమంపై క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. దీంతో ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో డిఎస్‌పిలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.