యూనిట్

రక్షా బంధన్‌

ఆగస్టు 15న రక్షా బంధన్‌ సందర్భంగా బ్రహ్మకుమారీలు 9వ పటాలము కమాండెంట్‌ ఎల్‌.ఎస్‌.పాత్రుడుకు రక్షాబంధన్‌ కట్టారు. ఈ సందర్భంగా సమాజంలో అన్నా చెల్లెలు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరు ఆడ మగ సోదరభావంతో మెలిగితే సమాజంలో మంచి వాతావరణం ఉంటుందని అన్నారు. పోలీసులు ఎప్పటికీ మహిళల పట్ల సోదర భావంతో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టి, మిఠాయిలు పంచారు.

వార్తావాహిని