యూనిట్

బాధితులకు సత్వర న్యాయమే 'స్పందన' లక్ష్యం

గుంటూరు రూరల్‌ జిల్లా పోలీసు కార్యాలయములో ప్రజా విజ్ఞప్తులను ''స్పందన'' కార్యక్రమము ద్వారా గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్పీ శ్రీమతి ఆర్‌. జయలక్ష్మి హాజరై ఆర్జీలను స్వీకరించారు. వాటి సంబంధిత ఇన్‌చార్జిలకు లేదా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లతో ఫోన్‌ లో మాట్లాడి సత్వరమే ఫిర్యాది దారులకు న్యాయం చేయవలసినదిగా ఆదేశించారు. గుంటూరు రూరల్‌ జిల్లా వ్యాప్తముగా స్పందన కార్యక్రమమునకు వచ్చే అర్జీ దారులకు కూర్చోవడానికి వసతి, వారికి మంచి నీటి సౌకర్యము కల్పించాలని అధికారులను ఆదేశించారు. 'స్పందన'లో ఫిర్యాదులు స్వీకరించి వెంటనే బాధితులకు రశీదు ఇవ్వటం జరుగుతుందన్నారు. స్పందన ద్వారా పంపిన ఫిర్యాదులను, సంబందిత పోలీసు స్టేషన్‌ అధికారులు నిర్దేశించిన సమయం లోపల విచారించి, ఫిర్యాది దారులకు సత్వరమే న్యాయం చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. స్పందన ఫిర్యాదుల గురించి సమాచారము తెలుసుకోదలచిన వారు జిల్లా ఎస్పీ గారిచే నూతనముగా ఏర్పాటు చేసిన స్పందన సెల్‌ నంబర్‌ 8688405050కు కాల్‌ లేదా వాట్సాప్‌ చేసి ఫిర్యాదులకు సంబంధించిన సమాచారమును తెలుసుకోవలసిందిగా జిల్లా ఎస్పీ ప్రజలకు తెలిపారు.

వార్తావాహిని