యూనిట్
Flash News
రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టండి...పశ్చిమ ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్
పశ్చిమ గోదావరి జిల్లా యస్.పి నవదీప్ సింగ్ గ్రేవాల్ పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయము లో గల
కాన్ఫరెన్సు హాల్ నందు జిల్లా పోలీస్ అదికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది.
ముందుగా పోలీసు అధికారులు అందరిచేత జాతీయ
ఓటర్లు దినోత్సము సందర్బముగా ఓటు హక్కును
వినియోగించుకోవడం ప్రతి భారతీయుడు
యొక్క హక్కు అని ప్రమాణము చేయించినారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ, నిజాయితీగా బాధ్యతతో అదికారులు అందరూ పనిచేయాలని, అలా చేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయన్నారు. గత సంవత్సరం కన్నా మెరుగైన ఫలితాలు ఈ సంవత్సరంలో తీసుకురావాలని ముఖ్యంగా రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా వుంచి, వారి ప్రతి కదలికను గమనించాలని, వారి యొక్క గైరుహాజరును కూడా గమనించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకొని విచారించాలని వివిధ సమస్యలు మరియు భాదలతో పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితులు, ప్రజల పట్ల అధికారులు మర్యాదగా వ్యవహరించాలన్నారు. మహిళల భద్రతను ప్రాధాన్యతగా గుర్తెరిగి పని చేయాలన్నారు. మహిళలు, బాలికలను ఇబ్బంది పెట్టే వారిపై ప్రత్యేక నిఘా వేయాలన్నారు. స్టేషన్ కు వచ్చు బాధితులకు మేమున్నాం అనే భరోసా కల్పించాలని అధికారులను ఉద్దేశించి తెలియజేసారు.
అలాగే కేసుల పురోగతి విషయంలో పూర్తిగా మార్పు తీసుకురావాలని పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ద చూపాలని, కేసు విషయాలపై పూర్తిగా అవగాహన పెంచుకొని, ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి పురోగతి సాదించాలని కేసులను పరిష్కరించే విషయంలో ఆలసత్వం వహించకూడదని తెలియజేసారు. రోడ్డు ప్రమాదాలు జరుగు ప్రాంతాలు గుర్తించి అక్కడ తగిన సూచిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా నివారించాలన్నారు. అక్రమ ఇసుక, మద్యం, గంజాయి రవాణా విషయంలో చట్ట వ్యతిరేకంగా పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో లో ఫిర్యాదుల సహాయక కేంద్రం యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 18001027222 పోస్టర్ ను ఎస్పీ విడుదల చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ బాలలు ఏదైనా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరియు దౌర్జన్యము లేదా దోపిడీకి గురైన పరిస్థితులను (శారీరక మానసిక మరియు లైంగికపరమైన) ఎదుర్కొన్నప్పుడు మా ఈ అత్యవసర సహాయ కేంద్రము సంప్రదించిన ఎడల మా సహాయ సహకారాలు అందించగలిగే విధముగా నిరంతరము సంసిద్ధత తో ఉంటామని తెలియజేసినారు.
ఈ నేర సమీక్షా సమావేశం లో ట్రైనింగ్ ఐపీఎస్ కృష్ణ కాంత్. ఎస్‌బి డిఎస్‌పి శ్రీనివాస చారి జిల్లాలోని డి.ఎస్.పిలు ఏలూరు డిఎస్‌పి డాక్టర్ ఓ.దిలీప్ కిరణ్ , కొవ్వూరు. డి.ఎస్.పి, కె. రాజేశ్వర్ రెడ్డి. నరసాపురం డి.యస్.పి కె.నాగేశ్వరరావు, జంగారెడ్డిగూడెం. డి.యస్.పి శ్రీమతి స్నేహిత, పోలవరం డి.యస్.పి ఎం.వెంకటేశ్వరరావు, మహిళా పోలీసు స్టేషన్. డి.ఎస్.పి, శ్రీ పైడెశ్వరావు, ఎస్.సి&ఎస్.టి, సెల్ 1 డిఎస్‌పి. ఏ. శ్రీనివాసరావు, సిసిఎస్, డిఎస్‌పి, వి.సుబ్రమణ్యం, ఎస్‌బి, సి,ఐ కె.రజిని కుమార్, డి.సి.ఆర్.బి, సి.ఐ. జి.వి కృష్ణ రావు మరియు పశ్చిమ గోదావరి పోలీసు న్యాయ సలహాదారుడు కె. గోపాలకృష్ణ మరియు జిల్లాలోని అందరు ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు హాజరైనారు.