యూనిట్
Flash News
వెహికల్ డ్రైవింగ్‌లో మారుతున్న పద్దతులు మరియు మెకానిజంపై పిటివోలో అవగాహనా సదస్సు
జూలై 15న పిటీవో ఐజీపి శ్రీ సత్యనారాయణ గారు మంగళగిరి పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో డ్రైవర్లు, మెకానిక్‌లకు ఎప్పటికప్పుడు మారుతున్న వెహికల్ డ్రైవింగ్ పద్దతులు మరియు మెకానిజం అంశాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన మహీంద్ర మోటార్ వాహన సంస్థ ప్రతినిథి రాజేష్ అధునాతన వెహికల్ డ్రైవింగ్ మెళకువలు, మెకానిజం అంశాల గూర్చి వివరించారు. ఇటువంటి వృత్తిగత అంశాలపై ఎప్పటికప్పుడు సిబ్బంది తమలో తాము బృంద చర్చలు జరపడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఆన్‌లైన్ వీడియోల ద్వారా డ్రైవింగ్ మరియు మెకానిజంలలో వస్తున్న సరికొత్త మార్పులు, మెళకువలను ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా, సులభంగా చూసి తెలుసుకోవచ్చని ఐజి గారు తెలియజేశారు. కాలంతో పాటు మారుతున్న ఈ విధానాలపై నిరంతరం అవగాహనా సదస్సులు జరుగుతూ వుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కే. కోటేశ్వరరావు, ఎమ్‌టివో డి. వాసు, వర్క్‌షాప్ ఆఫీసర్ ఏ. రామలింగేశ్వరరావు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.