యూనిట్
Flash News
భద్రతే ముందు – హెల్మెట్ తప్పనిసరి తిరుపతి జిల్లా యస్.పి డాక్టర్ గజరావు భూపాల్ ఐ.పి.యస్
ఈ రోజు తిరుపతి ట్రాఫిక్ పోలీస్ వారి అధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం ర్యాలీని తిరుపతి జిల్లా యస్.పి వారు అలిపిరి గరుడ సర్కిల్ నుండి హెల్మెట్ ర్యాలిని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు మాట్లాడుతూ భద్రతే ముందని ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని, వాహనదారులు రక్షణ పొందడమే కాకుండా వారిపై ఆదారపడిన వారిని కూడా రక్షించినవారవుతారని, హెల్మెట్ వాడటం వలన అదికంగా రోడ్డు ప్రమాదాలలో మరణాల సంఖ్య తగ్గవచ్చునని, రోడ్ ప్రమాదాలలో మరణానికి 90% పెద్ద పెద్ద గాయాలు తగిలి మరణాలు లేవని కేవలం చిన్న గాయాలైన అది హెల్మెట్ వాడకపోవడంవలెనేనని కావున వాహనదారులందరూ దీనిని గమనించి తప్పకుండా హెల్మెట్ ధరించాలని, జనవరి మొదటి రోజు నుండి ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని నిబంధనలను పాటించని వారికి జరిమానా తప్పదని అదేవిదంగా వాహనాలను సీజ్ చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లా యస్.పి గారు తెలుపుతూ స్వయంగా హెల్మెట్ దరించి ద్విచక్ర వాహనాన్ని నడిపి ముందుండి హెల్మెట్ ద్విచక్ర వాహన ర్యాల్లిని నడిపించారు.
ఈ కార్యక్రమానికి యస్.బి డి.యస్.పి గంగయ్య గారు, ట్రాఫిక్ డి.యస్.పి లు ముస్తఫా గారు, రమణ కుమార్ సి.ఐ లు సురేష్ కుమార్, పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.