యూనిట్
Flash News
ఫిన్స్ తో నేరాలకు అడ్డుకట్ట
ఫిన్స్ యాప్ తో
నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని అనంతపురం ఎస్పీ సత్యయేసు బాబు అన్నారు. దాని
పనితీరుపై వివరించారు. పోలీసుల గస్తీల్లో తచ్చాడిన అనుమానితులను చెక్ చేయాలంటే సాధారణంగా పోలీసు
స్టేషన్ కు తీసికెళ్లి విచారిస్తారు. అతని వేలిముద్రలను పేపర్ పై లేదా స్కానర్
ద్వారా స్కాన్ చేసి ఆ ఆనవాళ్లను ఫింగర్ ప్రింట్ బ్యూరో యూనిట్‌కి పంపి... వారి
ద్వారా ఫలితాలు రాబట్టాల్సి ఉంటుంది. ఈ విధానం కొంత ఆలస్యంతో కూడుకున్న పనే .
అంతేకాకుండా అనుమానితుడు అమాయకుడయితే అతనికి అసౌకర్యం కలిగే అవకాశముంది. అతను పాత
నేరస్తుడా కాదా అని నిర్ధారించుకోవాలంటే ఆ అనుమానితుడు తేలియజేసే వివరాలపై
ఆధారపడాల్సి ఉండేది. ఈక్రమంలో ఒక్కోసారి పోలీసులు ఆరోపణలకు కూడా గురయ్యేవారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధానానికి జిల్లా పోలీసులు స్వస్తి పలికారు. దీని
స్థానాన నూతనంగా జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని
వినియోగించి " ఫిన్స్ " ( FINS - ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అండ్ నెట్‌వర్కింగ్ సిస్టమ్) యాప్ ను
రూపొందించారు. జిల్లా అంతటా పోలీసులు విరివిగా వినియోగిస్తున్నారు. గస్తీ పోలీసులు, పెట్రోలింగ్ పార్టీలు, తదితర పోలీసులకు విధుల్లో ఫిన్స్ యాప్ నిత్యం దోహదపడుతోంది.
ఎలాంటి ఆరోపణలకు
తావులేకుండా పారదర్శకంగా పాత నేరస్తులను గుర్తించి ముందస్తుగా నేరాలను
అరికడుతున్నారు. ఈ ఫిన్స్ విధానంలో నేరస్తుల, అనుమానితులకు చెందిన ఫింగర్ ప్రింట్స్‌ను లైవ్ స్కానర్ ద్వారా ఆన్‌లైన్‌లో
డేటాబేస్‌తో సరిపోల్చి వెంటనే ఫలితం రాబట్టవచ్చు. ఈ ఫిన్స్ నెట్‌వర్కింగ్ సిస్టమ్
విధానం ద్వారా నేరస్తులను గుర్తించడం, అనుమానితులకు చెందిన నేర చరిత్ర తెలుసుకోవడం, నేరాలను నిరోధించడం, ముమ్మరమైన నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఫిన్స్ సిస్టమ్ ద్వారా ఉత్సవాలు, పుష్కరాలు, తిరునాళ్లు, బహిరంగ సమావేశాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు వంటి జనసమర్ధమైన, నేరాలు జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉండే ప్రదేశాలలో, రాత్రి పూట గస్తీ సమయంలో అనుమానితులను, నేరస్తులను గుర్తించేందుకు వెంటనే వీలు కలుగుతుంది. వారి వేలిముద్రలు అదే
ప్రదేశం నుంచి మొబైల్‌కి అనుసంధానించి ఇచ్చిన లైవ్ స్కానర్ ద్వారా, ఆన్లైన్ డేటా బేస్‌లో నిక్షిప్తమై ఉన్న సుమారు 6 లక్షల మంది పాత నేరస్తులకు చెందిన వేలి
ముద్రలతో సరిపోల్చి చూసి వెనువెంటనే ఫలితాలు పొందుతున్నారు.
ఇప్పటి వరకు 1,65,275 మందిని చెక్ చేయగా... 915 మంది పాత నేరస్తులని వెల్లడయ్యింది. వెంటనే
వీరిని అదుపులోకి
తీసుకొని నేరాలను నిరోధించగలుగుతున్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తున్నారు.
అదేవిధంగా అమాయికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారిని తక్షణం వదిలివేయవచ్చనేదే
జిల్లా ఎస్పీ సంకల్పం.