యూనిట్

చిత్తూరు జిల్లా పోలీసుకు 59 ఉత్కృష్ట మరియు అతి ఉత్కృష్ట సేవా పతకాల బహుకరణ

చిత్తూరు జిల్లా పోలీసు శాఖ నందు వృత్తి పరంగా చూపించిన సామర్థ్యం, నైపుణ్యం ఆధారంగా కానిస్టేబుల్ స్థాయి నుంచి డిఎస్పి స్థాయి అధికారులకు మినిస్ట్రీ అఫ్ హోం అఫైర్స్, గవర్నమెంట్ అఫ్ ఇండియా వారి తరపు నుంచి 59 ఉత్కృష్ట మరియు అతి ఉత్కృష్ట సేవా పతక సర్టిఫికేట్ లను బహుకరించడం జరిగినది. ఉత్కృష్ట సేవ పతకాల  కింద 39 మందికి, అతి ఉత్కృష్ట సేవ పతాకం  కింద 20 మందికి పతకాలు  వరించాయి. జిల్లా ఏఆర్ కార్యాలయం వద్ద చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్  పతక విజేతలు అందరిని అభినందిస్తూ సర్టిఫికెట్స్ ను ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్పి  మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో పోలీసు శాఖ నందు ఉత్తమ వృత్తి నిర్వహణ, తమ విధుల నందు సామర్థ్య, నైపుణ్యం ప్రదర్శించిన సిబ్బంది మరియు అధికారులకు ఈ పతకాలు  ఇవ్వడం జరుగుతుందని, 2019 సంవత్సరం కు గాను 59 మంది అధికారులు, సిబ్బందికి  ఈ పతకాలు బహూకరించడం జరిగిందని, వీరిలో ముగ్గురు హోం గార్డ్స్ కూడా ఉన్నారని తెలిపారు. జిల్లాకు మంచి పేరు తీసుకుని వచ్చిన సిబ్బంది మరియు అధికారులను ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలానే జిల్లా లో పనిచేస్తున్న సిబ్బంది అందరూ వారి సర్వీస్ నందు మంచిపేరు  సంపాదించుకొని జిల్లాకు పేరు తేవాలని కోరారు.

వార్తావాహిని