యూనిట్

సంక్రాతి క్రికెట్ పోటీలు ప్రారంభించిన ప్రకాశం ఎస్పీ సిద్దార్థ కౌశల్

ప్రకాశం జిల్లా    కొరిశపాడు మండలంలోని రావినూతల గ్రామమునందలి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ 29 వ అంతర్రాష్ట్రీయ క్రికెట్ పోటీలను ఎస్పీ సిద్దార్థ కౌశల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ పోటీలలో తలపడుతున్న జట్లను పరిచయం చేసుకొని వారితో కాసేపు క్రికెట్ ఆడారు. అనంతర ఎస్పీ మాట్లాడుతూ ఇంత మంచి క్రీడా మైదానం ఇక్కడ ఉండడం జిల్లాకు వరమని, ముఖ్యంగా యువ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తుకుని జిల్లాకు పేరు తేవాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు పాల్గొంటున్న క్రీడాకారులకు, చూడడానికి వచ్చే ప్రేక్షకులకు ఎంతో చక్కని సౌకర్యాలు కల్పించారని అభినందించారు.

ఈ పోటీలు జనవరి 9 నుండి 16 వరకు జరుగనున్నాయి. ఇందులో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు,రాష్ట్రాల జట్లతో పాటు బెంగళూరు,హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఒంగోలు జట్లు తలపడుతున్నాయి. ఈ కార్యక్రమంలో అద్దంకి సిఐ టి అశోక్ వర్ధన్, ఎస్ బి 2 ఇన్స్పెక్టర్ ఎం శ్రీకాంత్ బాబు, ప్రముఖ సినీ నటులు రఘు బాబు, డాక్టర్ హృదయనాథ్, కొరిశపాడు ఎసై ఎం. శివ నాంచారయ్య మరియు రావినూతల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోషియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

వార్తావాహిని