యూనిట్
Flash News
పోలీస్ అమర వీరుల కుటుంబాలకు అండగా నిలుస్తాం

పోలీస్
అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ
అద్నాన్ నయీం ఆస్మీ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా
జిల్లాలో అమరులైను 19 మంది
పోలీస్ కుటుంబాలతో జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ సమావేశం
నిర్వహించారు. సమావేశానికి హాజరైన పోలీస్ కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరితో ఎస్పీ
ప్రత్యేకంగా మాట్లాడారు. వారికి ప్రభుత్వం నుండి రావల్సిన బెనిఫిట్స్, వారి సమస్యలు, విన్నపాలు తెలుసుకున్నారు.
కొంతమంది సభ్యులు వారికి ప్రభుత్వం నుండి రావల్సిన భూమి ఇంతవరకు రాలేదని ఎస్పీ
దృష్టికి తీసుకువెళ్లగా కలెక్టర్‌తో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యను
పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీధర రావు, ఓఎస్డీ ఆరిఫ్ హాఫీజ్, ఏ.ఆర్.అదనపు ఎస్పీ
వి.ఎస్.ప్రభాకర్ తదితరలు పాల్గొన్నారు.