యూనిట్

కర్నూలు జిల్లాలో దిశ పోలీసు స్టేషన్ ఏర్పాటుకు స్ధలం పరిశీలన

కర్నూలు జిల్లాలో దిశ పోలీసు స్టేషన్ ఏర్పాటుకు స్ధలం పరిశీలన చేసిన కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ వీరపాండియన్ ఐఏయస్ గారు, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు.

 కర్నూలు జిల్లా కేంద్రంలో దిశ పోలీసు స్టేషన్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ శ్రీ వీరపాండియన్ ఐఏయస్ గారు, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారులు  స్ధలం పరిశీలన చేశారు. ఈ సంధర్బంగా శనివారం నగరంలోని ఎమ్ ఆర్ ఓ ఆఫీసు ప్రక్కన ఉన్న కర్నూలు మహిళా పోలీసుస్టేషన్ ను సందర్శించి పరిశీలించారు. 

జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన విషయం అందరికి తెలిసిందేనన్నారు. ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన దిశ చట్టాన్ని అమలు చేసేందుకు జిల్లా కేంద్రంలో దిశా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అనువైన స్ధలాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

మహిళా పోలీసు స్టేషన్లను బలోపేతం చేసి బాధిత మహిళలు తమ సమస్యలను స్నేహపూర్వక వాతావరణంలో విన్నవించుకుని పరిష్కరించుకునేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ గారు ల వెంట ట్రైనీ ఐపియస్ తుషార్ డుడి, కర్నూలు పట్టణ డిఎస్పీ శ్రీ బాబా ఫకృద్దీన్ గారు ఉన్నారు.  

 

వార్తావాహిని