యూనిట్
Flash News
సమాజంలో పోలీసుల సేవాలు అసమానమైనవి: రాష్ట్ర మంత్రి శ్రీ కురసాల కన్నబాబు

సమాజంలో
పోలీసుల సేవలు అసమానమైనవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శీ కురసాల కన్నబాబు గారు
అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా విజయవాడ నగర పోలీస్ కమీషనరేట్
పరిధిలోని ఆర్మ్‌డ్ రిజర్వ్ గ్రౌండ్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి దేవాదాయ
శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు గారితో కలిసి ముఖ్య అతిధిలుగా హాజరైనారు. ఈ
సందర్బముగా ఆయన మాట్లాడుతూ సంస్మరణ వారోత్సవాల్లో బాగంగా రక్తదానం చేస్తున్నవారికి
అభినందనలు తెలియజేసారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు
మాట్లాడుతూ ప్రజల కోసం అనేక మంది పోలీసులు అమరులౌతున్నారు. పోలీస్ వ్యవస్థ ప్రజల
రక్షణ కోసం ఉందనే విషయాన్ని విస్మరించ కుండా ప్రజలందరు వారికి సహాకరించాలని
పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ చేపడుతున్న
వివిధ కార్యమ్రాల వలను ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. అనంతరం నగర పోలీస్
కమీషనర్ శ్రీ సి.హెచ్. ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ పోలీసులు పట్ల ప్రజలకు
ఉన్న అపోహలు తొలగించి వారిలో సదాభిప్రాయాన్ని తీసుకు వచ్చేందుకు 'మేము మీ కోసమే ఉన్నాం' అనే నినాదాన్ని ముందుకు తీసుకు వస్తున్నామన్నారు. ప్రజలు మరియు పోలీసుల
మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడానికి పలు కార్యక్రమాలు చేపట్టినట్లు
పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ పోలీస్ కమీషనర్ డి.నాగేంద్ర కుమార్,
డిసిపిలు ఎస్. హరికృష్ణ, వి. హర్షవర్ధన
రాజు, శ్రీమతి ఉదయ రాణి, రాష్ట్ర
పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జె. శ్రీనివాసరావు, విజయవాడ
నగర పోలీస్ అసోషియేషన్ ప్రెసిడెంట్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.