యూనిట్

సమ సమాజ సందర్శిని పేరిట పోలీస్‌ సేవా

నెల్లూరు జిల్లా వింజమూరు పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ. బాజిరెడ్డి సమ సమాజ సందర్శిని కార్యక్రమంలో భాగంగా వింజమూరులో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. షెడ్యూల్‌ కులాల వసతి గృహంలో ముప్పైవేల రూపాయలతో స్టడీ గ్రౌండ్‌ను నిర్మించారు. విద్యార్ధుల త్రాగు నీటి కోసం ఎలక్ట్రికల్‌ కూలింగ్‌ బాక్స్‌ను, విద్యార్దుల వినియోగానికి బకెట్‌లు, జగ్గులను పంపిణీ చేశారు. కావలి డిఎస్పీ డి.ప్రసాద్‌, కలిగిరి సి.ఐ పి.రవికిరణ్‌ లు స్టడీ గ్రౌండ్‌ను మరియు కూలింగ్‌ బాక్స్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని