యూనిట్
Flash News
ఆత్మ హత్య కు యత్నించిన వ్యక్తిని కాపాడిని పోలీసులు
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం
మండలం ముదిరెడ్డిపల్లి కు చెందిన రవి అనే వ్యక్తి భార్యాభర్తలు గొడవలు కారణంగా
మంగళవారం మనస్పర్ధలకు గురై సూసైడ్
చేసుకోవడానికి రైల్వే ట్రాక్ పైకి రావడం
జరిగింది. ఇంతలో dail 100 ద్వారా వచ్చిన సమాచారం మేరకు, హిందూపూర్ 1టౌన్
సీఐ ఆదేశాలతో, అప్రమత్తమైన బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ షేక్ షా వలి అక్కడకు చేరుకొని
రవిని ప్రాణాపాయం నుండి కాపాడారు. సత్వరమే స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపడిన,
dail100 సిబ్బంది ని, కానిస్టేబుల్ షేక్ షా వలి ని జిల్లా ఎస్పి ఎస్ వి మాధవ రెడ్డి
అభినందించారు.