యూనిట్

గుట్కా తయారీ కంపెనీపై పోలీసులు దాడులు

ప్రకాశం జిల్లా మేదరమెట్ల గ్రామంలోని మేదరమెట్ల మౌనికా టొబాకో గోడౌన్‌లో నిషిద్ద పొగాకు ఉత్పత్తులను తయారు చేస్తున్నారనే సమాచారం పై దర్శి డిఎస్పీ కె. ప్రకాష్‌ రావు మరియు ఎస్బీ డిఎస్పీ వి.ఎస్‌.రాంబాబు ఆధ్వర్యంలో పోలీస్‌ బృందాలు దాడులు నిర్వహించాయి. నిషిద్ద పొగాకు పదార్ధాలైన గుట్కా, ఖైనీ, హన్స్‌ చాప్‌ టొబాకో అనే ఢిల్లీ కంపెనీ మరియు బెంగుళూరుకు చెందిన బ్లూ బుల్‌ పొగాకు లేబుల్‌ గల పాకెట్లను అక్రమంగా తయారు చేస్తున్నారు. నిషిద్ద పొగాకు పదార్ధాలను తయారు చేయడానికి కావల్సిన మెషినరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. గొడౌన్‌లో 265 బస్తాల పొగాకు పొడి, 10 పొగాకు ఆయిల్‌ డబ్బాలు, అమ్మోనియం క్లోరైడ్‌ 1/2 కిలోవి - 5, లైన్‌ బ్రాండ్‌ తెల్ల డబ్బాలు-7, టింబా కంపెనీ 50 కిలోల బస్తాలు - 4, బ్రౌన్‌ కలర్‌ ప్యాకింగ్‌ రోల్స్‌-8, హన్స్‌ ఇండియా ఖాళీ ప్యాకింగ్‌ పాకెట్స్‌ ఒక బస్తా, పలుకు రాయి 60 కగ్‌ల బస్తా, హన్స్‌ ఇండియా ప్యాకింగ్‌ రోల్స్‌ - 1, స్టార్‌ కంపెనీ ప్యాకింగ్‌ రోల్స్‌ ఒకటిలను స్వాధీనం చేసుకున్నారు. ముద్దా యిలను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను నియమించినట్లు ఎస్పీ సిద్దార్దకౌశల్‌ తెలిపారు. ఈ దాడిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన డిఎస్పీలు కె.ప్రకాష్‌ రావు, వి.ఎస్‌.రాంబాబు, సి.ఐ టి.అశోక్‌ వర్ధన్‌, ఎస్సై టి.బాలకృష్ణ, ఎస్బీ హెడ్‌ కానిస్టేబుల్‌ జిలానిలను ఎస్పీ అభినందించారు.

వార్తావాహిని