యూనిట్

ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసు భాగస్వామ్యం

సమసమాజ స్థాపనలో పోలీసులు భాగస్వామ్యం కావాలని తిరుపతి అర్బన్‌ ఎస్‌.పి. అన్బురాజన్‌ అన్నారు. తిరుపతి అర్బన్‌ జిల్లా పరిధిలోని చంద్రగిరి మండలం ముంగిలిపట్టు హరిజనవాడలో నూతనంగా నిర్మించిన వాటర్‌ట్యాంక్‌ను ఎస్‌.పి. ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌.పి. మాట్లాడుతూ ఇటీవల సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించామని, ఇందులో ముంగిలిపట్టు హరిజనవాడలో మౌలిక సదుపాయాలతోపాటు అనేక సమస్యలను గుర్తించినట్లు చెప్పారు. తాగునీటి కోసం నిత్యం ఇక్కడ గొడవలు జరుగుతున్నాయన్నారు. పోలీసు వెల్ఫేర్‌ ఫండ్‌ నిధుల ద్వారా, చంద్రగిరి పోలీసు సహకారంతో వాటర్‌ ట్యాంక్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అర్బన్‌ జిల్లాలో ఏ గ్రామంలోనైనా తాగునీటి సమస్య ఉందని తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో డిఎస్‌పి వినోద్‌కుమార్‌, సిఐ ఆరోహణరావు, ఎస్‌.ఐ.లు సంజీవ్‌కుమార్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని