యూనిట్
Flash News
అనాధ యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు

ఒక యువతిని ప్రేమించి ఆమె
తన ప్రేమను తిరస్కరించిన మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి
పాల్పడిన యువకుడిని కాపాడిన పోలీసులు. అతన్ని మెరుగైన వైద్యం
కోసం విజయవాడ పోలిసుల సొంత ఖర్చులతో
తరలించి అతని ప్రాణాపాయం నుండి రక్షించిన ఘటన ఏలూరు రెండో పట్టణ
పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే .ఏలూరు
తంగెళ్ళమూడి ప్రాంతంలో నివాసముంటున్న వీర గణేష్ అలియాస్ చోటు
అనే యువకుడు స్థానికంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సీలింగ్ పనులు చేస్తూ జీవనం
సాగిస్తున్నాడు. అతని చిన్నతనంలోనే తల్లి, తండ్రి మృతి చెందడంతో అతను స్థానికంగా ఉన్న యువకులతో కలిసి తొమ్మిదేళ్లుగా
ఏలూరు లోనే జీవిస్తున్నాడు. స్థానికంగా ఉండే ఓ యువతిని అతను ప్రేమించాడు కానీ ఆ
యువతి అతని ప్రేమను తిరస్కరించింది. దీంతో గణేష్ తీవ్ర
మనస్తాపానికి గురయ్యాడు. అతను ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయించుకుని శుక్రవారం
అర్ధరాత్రి సమయంలో ఒంటిపై బ్లేడుతో కోసుకుని, ఆపై బ్లేడు
మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు .ఇది గమనించిన తంగెళ్ళమూడి ప్రాంత యువకులు
వెంటనే 100కు డయల్ చేశారు.
అప్రమత్తమైన రెండో పట్టణ సీఐ ఆది
ప్రసాద్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని చికిత్స నిమిత్తం ఏలూరు
ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతని పరిస్థితి విషమంగా
ఉండడంతో వెంటనే విజయవాడ ఏరియా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అయితే అతను అనాథ
కావడంతో వల్ల ఆస్పత్రికి తరలించేందుకు అతనికి తోడు ఎవరు లేరు. దీంతో
రెండో పట్టణ సీఐ ఆది ప్రసాద్ ఆదేశాల మేరకు ఎస్సై నాగేంద్ర ప్రసాద్ , పి సి కొండపల్లి వెంకటేశ్వరరావు, మరొక హోమ్ గార్డ్ ను ఆ యువకుడికి ఎస్కార్ట్ గా
ఇచ్చి విజయవాడ తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి
వైద్యులు అతను మ్రింగిన బ్లేడు ను కక్కించి అతనికి అన్ని టెస్టులు నిర్వహించి
ప్రాణాపాయ స్థితి నుండి కాపాడారు.
అతనికి చికిత్స పూర్తయిన తర్వాత
కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు అతన్ని తిరిగి మరల ఏలూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్
కు తరలించారు. రెండో పట్టణ సీఐ అది ప్రసాద్ ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ అతనికి మందులు
దుస్తులు కొన్నిచ్చారు.