యూనిట్
Flash News
పోలీస్ వాచకాలను తప్పనిసరిగా పాటించాలి: డిఐజి ఎ.ఎస్.ఖాన్
పోలీస్
శిక్షణలో వున్న కానిస్టేబుళ్ళు పోలీస్ వాచకం పుస్తకాలలో వున్న అంశాలను
తప్పనిసరిగా పాటించాలని ఏలూరు రేంజ్ డిఐజి ఎ.ఎస్. ఖాన్ తెలిపారు. తపశిపూడిలోని
కృష్ణా జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో 211 మంది యస్.సి.టి.పి.సి (ఏఆర్) లకు ఇండక్షన్
శిక్షణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. పోలీస్ శాఖ దిశా
నిర్దేశం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ మాన్యువల్‌ను రూపొందించిందని, దాని ద్వారా ఎవరెవరు ఏఏ విధులు నిర్వహించాలో వివరంగా వుంటాయని తెలిపారు.
శిక్షణా కాలంలో శారీరక దారుఢ్యం పెంపొందించుకుని, మీకు నేర్పించే లాఠీ డ్రిల్, ఆర్మ్స్ డ్రిల్, ఇండోర్, అవుట్ డోర్‌లను శ్రద్ధగా నెర్చుకోవాలని కోరారు.
అనంతరం కృష్ణా
జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ మాట్లాడుతూ మంచి వాతావరణంలో శిక్షణ కేంద్రం
వున్నదన్నారు. మీకు షెడ్యూల్‌లో కేటాయించిన దాని ప్రకారం శిక్షణ అందిస్తామన్నారు.
శిక్షణలో మీకు లైఫ్ సేవింగ్ నైపుణ్యాలైన డ్రైవింగ్, స్విమ్మింగ్ వంటి వాటిని నేర్పిస్తామన్నారు. కార్యక్రమంలో డిటిసి అదనపు
ఎస్పీ వై.టి. నాయుడు, డిఎస్పీలు ధర్మేంద్ర, విజయ రావు, ఉమామహేశ్వర రావు, మెహబూబ్ బాషా, అజీజ్, వెంకటేశ్వర్లు, సిఐలు చంద్రశేఖర్, దుర్గాప్రసాద్, కొండయ్య, వెంకటేశ్వర్లు, అఖిల్ జమ, ఆర్.ఐలు చంద్రశేఖర్, విజయసారధి తదితరులు పాల్గొన్నారు.