యూనిట్

గిరిజనుల సేవలో పోలీస్‌ యంత్రాంగం

గిరిజనుల సేవలో పోలీస్‌ యంత్రాంగం గిరిజనులకు పోలీసుశాఖ అండగా ఉంటుందని విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి.రాజకుమారి అన్నారు. పాచిపెంట మండలం నందేడవలసలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 'సంజీవిని' మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భముగా ఆమె మాట్లాడుతూ గిరిజన సమస్యలు, సమాచారం తెలియజేస్తే సమస్యల పరిష్కారానికి కషిచేస్తామన్నారు. పోలీసుశాఖకు సహకరిస్తే అభివద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. మావో ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. గిరిజన రైతులకు పోలీసు శాఖ ద్వారా వ్యవసాయ పరికరాలు, విత్తనాలు అందించామన్నారు. స్ఫూర్తి కార్యక్రమం ద్వారా విద్యార్ధులకు పుస్తకాలు అందిస్తున్నామన్నారు. అమ్మఒడి, అంగన్‌వాడీ కేంద్రాలను వినియోగించు కోవాలని సూచించారు. వైద్య శిబిరంలో విజయనగరం మిమ్స్‌ ఆసుపత్రి, గురివినాయుడుపేట పీహెచ్‌సీ వైద్యులు, సాలూరు తంగరాజ్‌ ఆసుపత్రి కంటి వైద్యులు పలు గ్రామాలకు చెందిన 500 మంది రోగులకు వైద్య సేవలు అందించారు. గిరిజన పేదలకు 500 దుప్పట్లు, 500 చీరలు, 200 గొడుగులు, యువతకు వాలీబాల్‌ కిట్టులు ఎస్పీ రాజకుమారి పంపిణీ చేసారు. పశువులకు పాంచాలి పశువైద్యులు ఎం.జగదీష్‌ మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సాలూరు సీఐ ఎస్‌.సింహాద్రినాయుడు, పాచిపెంట ఎస్‌ఐ సీహెచ్‌. గంగరాజు, ఉప తహసీల్దారు కె.నాగేశ్వరరావు, ఎంఈవో జోగారావు పాల్గొన్నారు.

వార్తావాహిని