యూనిట్
Flash News
నవజాత శిశువును తల్లి ఒడి చేర్చిన పోలీస్
కాకినాడ
ప్రభుత్వ ఆసుపత్రి నుండి అదే రోజు పుట్టిన పసిపాప అపహరణకు గురికాబడడం
రాష్ట్రవ్యాప్త సంచలనంగా మారింది. ది 23.11.2017 వ తేదీ గంటా లక్ష్మీ అనే మహిళకు జన్మించిన పసిపాపను సాయంత్రం 6 గం.ల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకొనిపోవడం కలకలం
రేకెత్తించింది. సమాచారం అందిన వెంటనే జిల్లా స్థాయిలో పోలీస్ యంత్రాంగం రంగంలోకి
దిగింది. జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని ప్రత్యక్ష పర్యవేక్షణలో డిఎస్పీ, సి.ఐలు, ఎస్సైలతోపాటు దాదాపు 200 మంది పోలీస్ సిబ్బంది అణువు, అణువు గాలింపు
చేపట్టారు. సి.సి ఫుటేజ్ ద్వారా ఒక మహిళ ఆ శిశువును అపహరించినట్లు గుర్తించిన
పోలీసులు ఆ మహిళ చిత్రాన్ని సోషల్ మీడియా, ప్రింట్ అండ్
ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తతంగా ప్రచారం చేయించారు. ఆ ఫోటోతో ప్రతి ఇంటిలోను
విచారించారు. పోలీస్‌ల తీవ్ర శ్రమకు ఫలితం వచ్చింది. అంబేద్కర్ భవన్ సమీపంలోని
వెంకటేశ్వర నగర్ స్థానికుల నుండి వచ్చిన సమాచారం ప్రకారం కిడ్నాప్ చేసిన మహిళ తమ
ప్రాంతంలోనే అద్దెకు నివశిస్తున్నట్లు చెప్పారు. దానితో అక్కడకు చేరుకున్న
పోలీసులు ఆ ఇంటికి తాళం వేసి వుండడంతో యజమానిని విచారించారు. పండు రమణ అనే మహిళ తన
భర్త శ్రీనివాస్‌తో కలసి గత మూడున్నర నెలలుగా ఆ ఇంటిలో అద్దెకు ఉంటున్నట్లు,
ఆమె ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్స్‌గా చేస్తుండగా భర్త సెక్యూరిటీ
గార్డ్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. తాను గర్భంతో వున్నానని చెప్పి, రెండు నెలలుగా ఇంట్లోనే వుంటుందని- నిన్న ఒక శిశువును తీసుకుని వచ్చి తనకు
పుట్టిన బిడ్డగా చెప్పిందని చుట్టు ప్రక్కల వారు చెప్పారు. ఇంతలో భర్త శ్రీనివాస్
ఇంటికి రావడంతో అసలు విషయం తేటతెల్లం అయ్యింది. తన భార్యకు రెండు సార్లు
గర్భస్రావం జరిగిందని, దానితో పిల్లలపై ఆపేక్ష మరింత
పెరిగిందని, ఈ నేథ్యంలో శిశువును దొంగిలించి తన పుట్టిల్లు
ఐ. పోలవరం మండలం జి. మూలపాలెం వెళ్ళిపోయి వుండవచ్చని చెప్పాడు. తక్షణమే డీఎస్పీ
రవివర్మ పర్యవేక్షణలో సి.ఐ సన్యాసిరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ సిబ్బంది కొంత
మంది వైద్య బృందాన్ని వెంట తీసుకొని మూలపాలెం వెళ్ళి, చాక
చక్యంగా పసిబిడ్డతో సహా పండు రమణను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ విశాల్‌గున్ని
ఆదేశాలపై ప్రత్యేక అంబులెన్స్‌లో పసిపాపను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు
తీసుకొచ్చారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్‌గున్నిలు
ఆ చిన్నారిని తల్లి గంటా లక్ష్మికి అందజేసారు. ఆసుపత్రి వద్ద భారీగా గుమిగూడిన జన
సందోహం పోలీసుల పనితీరుకు పెద్ద ఎత్తున హర్షద్వానాలతో సంతోషం వ్యక్తపరిచారు.
కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్ని యావత్
పోలీసు సిబ్బంది అలుపెరుగని విధి నిర్వహణతో తల్లి, బిడ్డల
జీవితాలలో వెలుగులు నింపారని అభినందించారు.