యూనిట్

గిరిజన యువతకు పోలీస్ ప్రోత్సాహం

విశాఖ జిల్లాలో పోలీసు భారీ ఎత్తున ప్రజా సంక్షేమ, సన్నిహిత కార్యక్రమాలు నిర్వర్తించి గిరిజన ప్రజలకు మరింత చేరువవుతున్నారని నర్సీపట్నం ఓఎస్డి కృష్ణారావు అన్నారు. చింతపల్లి మండంలోని కోరుకొండలో ఉచిత వైద్య శిబిరం, గిరిజన యువతకు వాలీబాల్ పోటీలు ప్రారంభోత్సవంలో మాట్లాడారు. గిరిజన యువత వికాసానికి పోలీస్ శాఖ ఎంతో చిత్తశుద్ది తోడ్పడుతున్నదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితాన్ని చక్కదిద్దుకోవాని సూచించారు. 500 మందికి డాక్టర్స్ దశరథ్, సంతోష్చే వైద్యపరీక్షు నిర్వహించి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేసారు. వాలీబాల్ పోటీలో విజేత జట్టుకు రూ. 20 మే, రెండో స్థానంలో నిలిచిన జట్టుకి రూ. 10 మే, మూడో స్థానం సాధించిన జట్టుకు రూ. 5 మే నగదు బహుమతిని ఓఎస్డి అందజేసారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి సీఐ పాపినాయుడు, అన్నవరం ఎస్ఐ రఘవర్మ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని