యూనిట్

కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రంలో చిక్కుకున్న మహిళలను రక్షించిన పోలీస్ శాఖ

కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రంలో చిక్కుకున్న పశ్చిమగోదావరి జిల్లా మహిళలు తమ దీనావస్థపై సోషల్ మీడియాలో వీడియో పెట్టారు.అది  వైరల్ అవ్వడం తో రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి తెలియపరిచారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్ గారికి   తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. డిజిపి గారు వెనువెంటనే చర్యలు తీసుకుని దిశా ప్రత్యేక అధికారి  దీపికా పాటిల్ మరియు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ లను రంగంలో కి దించారు. అధికారులు ఇరువురు బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి వివరాలను సేకరించారు. వారిచ్చిన వివరాల మేరకు కువైట్ ఎంబసీతో సంప్రదింపులు జరిపి నలుగురు బాధిత మహిళలకు విముక్తి కల్పించి స్వగ్రామాలకు తీసుకురావడానికి తగు చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి మహిళలను విడిపించడం పై వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తపరిచారు. 

వార్తావాహిని