యూనిట్

వరదల్లో చిక్కుకున్న యువకుడ్ని కాపాడిన పోలీస్‌ కానిస్టేబుల్‌

వరదల్లో చిక్కుకున్న యువకుడ్ని కాపాడిన పోలీస్‌ కానిస్టేబుల్‌ తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి కరకట్ట దిగువలో అప్పన్నపల్లి వెళ్లే రహదారి మధ్య వున్న కాజ్‌వేపై నడుచుకుంటు వెళ్తుండగా వరద ఉద్ధృతి అధికంగా రావడంతో ముగ్గురు యువకులు జారిపోయారు. వరదలో కొట్టుకుపోయిన షేక్‌ రెహ్మాన్‌, షేక్‌ షమీర్‌లు గల్లంతయ్యారు. పెదపట్నానికి చెందిన షేక్‌ వజీర్‌ను స్థానికంగా వున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ పి.సూరిబాబు ప్రాణాలకు తెగించి రక్షించాడు. వరదలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఒక యువకుని ప్రాణాలు రక్షించిన కానిస్టేబుల్‌ను అమలాపురం డిఎస్పీ మషూమ్‌ బాషా అభినందించారు.

వార్తావాహిని