యూనిట్
Flash News
వరదల్లో పోలీసుల సాహసం.....
కృష్ణా
నది ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద నీరు
చేరింది. ఆ ఫ్లోను తగ్గించేందుకు ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీటిని ప్రకాశం
బ్యారేజ్ నుండి విడుదల చేశారు. భారీగా విడుదలైన ఆ నీటితో కృష్ణా జిల్లాలోని దిగువ
లోతట్టు ప్రాంతాలైన అవనిగడ్డ, నాగాయలంక,
శ్రీకాకుళం, పాపవినాశనం, గోగినేని పాలెం తదితర కృష్ణా పరివాహ ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వరద
నీరు అధికంగా వస్తుందన్న ముందస్తు సమాచారంతో జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు
జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. వరదల్లో చిక్కుకున్న
స్థానిక ప్రజానీకానికి అండగా పోలీస్ శాఖ నిలిచింది. ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో
ప్రజలను సురక్షిత స్థావరాలకు తరలించి పునరావసం కల్పించారు. ఘంటసాల మండలంలో
పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు లంక గ్రామాలకు వెళ్ళి వరదల్లో చిక్కుకున్న
వారిని చల్లపల్లి సి.ఐ వెంకట నారాయణ చొరవ తీసుకుని వారిని రక్షించారు. కంచికచర్ల
మండలం చెవిటికల్లు వద్ద వరద గ్రామంలోనికి చొచ్చుకు రావడంతో పడవ సహాయంతో అటు వైపు
వున్న వారు ఇవతల ఒడ్డుకు రావాలని చూడగా ఒక్కసారిగా ఉదృతి పెరగటంతో పడవలో వున్నవారు
భయంతో అటూ, ఇటూ కదలడంతో పడవ బోల్తా పడింది. అందులో ఒక పాప
గల్లంతవ్వడంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ శ్యామ్, పిసి - 796, ప్రాణాలకు తెగించి నీటిలో దూకి
సురక్షితంగా పాపను ఒడ్డుకు చేర్చాడు. కృష్ణా జిల్లా పోలీసులు చేసిన సేవలను ప్రజలు
పలు విధాలుగా మెచ్చుకున్నారు.