యూనిట్
Flash News
కాలుష్య నివారణకు మొక్కల పెంచాలి
ప్రస్తుత
సమాజంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందని, దాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని 16వ పటాలం కమాండెంట్ వి.జగదీష్ కుమార్ అన్నారు. వనం - మనం కార్యక్రమంలో
భాగంగా పోలీస్ శిక్షణ కేంద్రంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య
అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం, వాటిని
సంరక్షించడం తమ భాద్యతగా భావించాలన్నారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్
అందించాలంటే ఇప్పటి నుండే మొక్కలను నాటి వాటిని పెంచాల్సిన ఆవశ్యకత వున్నదన్నారు.
రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మొక్కల నాటడం యద్ద ప్రాతిపదికన చేపట్టడం వలన అన్ని
ప్రభుత్వ శాఖల కన్నా మన శాఖే ముందున్నదన్నారు. పోలీస్ శిక్షణ కేంద్రంలో అధికారులు,
సిబ్బంది సంయుక్తంగా కలిసి సుమారు అయిదు వందల మొక్కలను నాటారు. కార్యక్రమంలో
పటాలం అసిస్టెంట్ కమాండెంట్ జీవీ ప్రభాకర రావు, ఆర్.ఐలు
ఎస్.ప్రభాకర రావు, జేసిహెచ్ కేశవ రావు, ఎస్.కోటేశ్వర రావు మరియు ఇతర అధికారులు, సిబ్బంది
పాల్గొన్నారు.