యూనిట్
Flash News
మొక్కలు మనకు ప్రాణ రక్ష
వనం-మనం' కార్యక్రమంలో భాగంగా 6వ పటాలము మంగళగిరిలో కమాండెంట్ డాక్టర్ గజరావు భూపాల్ మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ మొక్కలు ప్రకృతికి ప్రాణరక్ష అని, వాటిని మనం సంరక్షిస్తే... మనల్ని మొక్కలు ఆరోగ్యంగా కాపాడుతాయన్నారు. అంతేగాక వాతావరణ సమతుల్యాన్ని కాపాడుటలో సహాయ పడుతాయన్నారు. భావితరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించిన వారమవుతామని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఎస్.సాయి ప్రసాద్, అసిస్టెంట్ కమాండెంట్‌లు శ్రీనివాస బాబ్జి, హనుమంతుతోపాటు ఆర్.ఐ.లు, పటాలము సిబ్బంది పాల్గొని మొక్కలు నాటి నీరు పోశారు. వీటి సంరక్షణ కూడా మనందరి బాధ్యతని అన్నారు. అనంతరం పటాలము పరిధిలోని వివిధ పాఠశాలల్లో 'వనం మనం' కార్యక్రమం నిమిత్తం విద్యార్థులకు మొక్కలు పంచి, మొక్కలు నాటించారు.