యూనిట్
Flash News
వాతావరణ సమతుల్యానికి మొక్కల పెంపకం ఆవశ్యం
వనం-మనం' కార్యక్రమంలో భాగంగా ఎస్‌వి యూనివర్శిటీ
ప్రాంగణంలో వర్శిటీ రిజిస్ట్రార్ సిద్ధారెడ్డి ఇతర ఉన్నతాధికారులు ఆధ్వర్యంలో ఎస్.పి.
కె.అన్బురాజన్ మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా ఎస్.పి. మాట్లాడుతూ రాష్ట్ర
డిజిపి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ వారంలోనే 10వేల
మొక్కలు పోలీసు సిబ్బంది నాటారన్నారు. పోలీసుతోపాటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సైతం పాల్గొంటున్నట్లు చెప్పారు. ''ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటండి, ఆ మొక్కే మానై
మనతోపాటే పెరిగి మనకంటూ మన గుర్తుగా తరువాత మన జ్ఞాపకాలుగా ఈ భూమి మీద మిగిలేది
ఇది ఒక్కటే'' అని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి.లు
రాజేశ్వరరెడ్డి, మహేశ్వరరెడ్డి, అనిల్‌కుమార్‌బాబు,
వెంకటేసులు నాయక్, ఇతర డిఎస్‌పిలు. సిఐలు,
ఎస్.ఐ.లు పాల్గొని మొక్కలు నాటారు.