యూనిట్
Flash News
ఎస్పీ ఔదార్యంతో ముగ్దులౌతున్న ప్రజలు
కడప జిల్లా ఎస్పీ కేకేఎన్. అన్బురాజన్‌కు జిల్లా
ప్రజల నుంచి వారినుండి ప్రశంసలు అందుతున్నాయి. స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు
చేయడానికి వస్తున్న వృద్ధులు, వికలాంగులు,
బాలింతల వద్దకు ఎస్పీనే నేరుగా వచ్చి వారి ఫిర్యాదులను
స్వీకరిస్తున్నారు. వారి సమస్యలను తెల్సుకున్న తర్వాత సంబంధిత అధికారులకు అక్కడి
నుంచే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాజంపేటకు చెందిన బాలింత స్వాతి
ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేయడానికి వచ్చింది. తను నడవలేని స్థితిలో వున్న
విషయాన్ని తెల్సుకున్న ఎస్పీ ఆమె వద్దకు వెళ్లి ఆమె సమస్యను విన్నాడు. తను మగ
శిశువుకు జన్మనిచ్చిన మూడురోజులవుతుందని, తన అత్తింటివారు,
భర్త బిడ్డను తీసుకుని తనను పుట్టింటికి తరిమేశారని విలపిస్తూ
న్యాయం చేయమని కోరింది. తక్షణమే స్పందించిన ఎస్పీ ఆమెను రక్షక్ వాహనంలో వారింటికి
పంపించి, రాజంపేట డిఎస్పీతో మాట్లాడి సమస్యను వెంటనే
పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.