యూనిట్
Flash News
ప్రజల్లో పోలీస్‌లపై విశ్వాసం పెరగాలి
ప్రజల్లో పోలీస్ సేవల పై విశ్వాసం పెరిగి, పోలీసులపై నమ్మకం, భరోసా కలిగేలా ఉద్యోగ విధులను నిర్వర్తిం చాలని చిత్తూరు జిల్లా ఎస్పీ సి.హెచ్. అప్పల నాయుడు అన్నారు. జిల్లా పాత పోలీస్ కార్యాలయం ఆవరణలో నూతన బ్లూకోల్ట్స్ వాహనాలను ఏఎస్పీలు శ్రీమతి సుప్రజ, శ్రీకృష్ణార్జున జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. 63 నూతన బ్లూకోల్ట్స్ ద్విచక్ర వాహనాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ వాహనాలకు 'భద్రత' అనే పేరును నామకరణం చేసారు. ఈ వాహనాలకు ఫింగర్ ప్రింట్ నెట్‌వర్క్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఫిన్స్)ను అనుసంధానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్మార్ట్ మొబైల్ ఆధారిత సాప్ట్‌వేర్ ద్వారా ఎవరైనా అనుమానితులు దొరికితే వారి వేలి ముద్రలు ఆధారంగా చెక్ చేసే వెసులుబాటు వుంటుందన్నారు. ఈ యాప్ ద్వారా నేరస్తులను తక్కువ సమయంలోనే వేగవంతంగా గుర్తించడానికి అవకాశం వుంటుందని తెలిపారు. ఇందులో పది లక్షల మంది నేరస్థుల వేలిముద్రల డేటాబేస్ నమోదై వుంటుందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రమౌళీ, డిఎస్పీలు ఈశ్వర్ రెడ్డి, కృష్ణమోహన్, లక్ష్మీనారాయణ రెడ్డి, గిరిధర్, సి.ఐలు భాష్కర్ రెడ్డి, మహేశ్వర్, వాహిద్ తదితరులు పాల్గొన్నారు.