యూనిట్

అమరులైన పోలీసుల త్యాగాలను స్ఫూర్తిగా పొందాలి

అమరులైన పోలీసుల త్యాగాలను  స్ఫూర్తిగా పొంది ప్రజలకు పోలీస్ సేవలను అందించాలని పోలీస్ సిబ్బందికి రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారు పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయి పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా సోమవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన పరేడ్‌లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అయన మాట్లాడారు. ఈ సంవత్సరం మన రాష్ట్రంలో  ఇద్దరు కానిస్టేబుల్స్ మరియు దేశవ్యాప్తంగా 292 మంది వారి జీవితాలను త్యాగం చేశారన్నారు. వారి త్యాగాలను పోస్ శాఖ మరువదన్నారు. పోలీస్ ఉద్యోగం ఎంతో కఠినమైన దైనా  ప్రజలకు సేవచేయడంలో ఆనందం ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోలీస్ శాఖకు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నారన్నారు. ప్రతి పోలీస్ సిబ్బందికి వారాంతపు సెలవులను మంజూరు చేసి ప్రతి పోలీస్ కుటుంబంలో ఆనందాన్ని నింపారన్నారు. హోమ్ గార్డ్స్ జీతాలు పెంచి చిరు జీవుల కుటుంబాలకు  ఆర్థిక భరోసాను కల్పించారు.

వార్తావాహిని