యూనిట్

తిరుపతి అర్బన్ జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్

జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్. తప్పి పోయిన, అనాథలైన, కన్నవాళ్లకు దూరమై, పోషణకు భారమై, ఇంటినుంచి పారిపోయి, బస్టాండ్లు, రైల్వే స్టేషన్, హోటళ్లలో, కర్మాగారాలలో మగ్గుతున్న చిన్నారులు  34 మంది గుర్తింపు.


తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి డా. గజరావు భూపాల్ ఐ.పి.యస్ గారి ఆదేశాల మేరకు తిరుపతి అర్బన్ జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఈ రోజు ఉదయం 5 గంటల నుండి చిన్న పిల్లల సంరక్షణ ప్రారంభమైనది. ఇందులో భాగంగా 14 సంవత్సరాల లోపు రోడ్లపై సంచరిస్తున్న, పబ్లిక్ ప్రదేశాలలో, బస్సు షెల్టర్ కూడళ్ళలో బిక్షాటన చేస్తున్న వారిని, సుమారు 34 మంది పిల్లలను జిల్లా పోలీసు వారు గుర్తించడం జరిగింది. ఈస్ట్ పి.యస్ పరిదిలో రైల్వేస్టేషన్, బస్టాండ్, దేవాలయాలలో మొదలగు ప్రాంతాలలో 15 మంది, అలిపిరి 02, రేణిగుంట అర్బన్ పరిదిలో 07 మంది, మహిళా పోలీస్ స్టేషన్ అధ్వర్యంలో 06, తిరుచానూర్ పరిదిలో 01, వెస్ట్ పి.యస్ పరిదిలో 05, యం.ఆర్ పల్లి పి.యస్ పరిదిలో 01, ఏర్పేడు 03, మహిళా 04, రేణిగుంట 05 మందిని బాలురు 23, బాలికలు 11 గుర్తించినాము. పిల్లల సంరక్షనకొరకై, పిల్లల యొక్క తల్లితండ్రులను మరియు వారికి సంబంధించిన బంధువులను పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను అప్పగించడం జరుగుతుంది. మిగిలిన పిల్లలను డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ హోం కి, హోం యొక్క అధికారుల సమక్షంలో పిల్లలను అప్పగించడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలు మీ పరిదిలో ఎక్కడైనా చిన్న పిల్లలు పనిచేస్తున్నట్లు చూసినా, సమాచారం అందినా వాటిని పోలిసుల దృష్టికి తీసుకొనివచ్చినట్లతే పిల్లలను సంరిక్షడంతోపాటు పిల్లల దగ్గర పనులు చేయించుకునే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని, తల్లితండ్రులు, బందువులు లేని పిల్లలను సంబందిత హోం కి పంపడం జరుగుతుందని దీనికి అందరు సహకరించాలని, ఆపరేషన్ ముస్కాన్.. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం తప్పి పోయిన, అనాథలైన, కన్నవాళ్లకు దూరమై, పోషణకు భారమై, ఇంటినుంచి పారిపోయి, బస్టాండ్లు, రైల్వే స్టేషన్, హోటళ్లలో, కర్మాగారాలలో మగ్గుతున్న చిన్నారులకూ విముక్తి కల్పించి, కాపాడడమే. ఆపరేషన్ ముస్కాన్ యొక్క ముక్య ఉద్దేశమని, ఈ సందర్భంగా తిరుపతి జిల్లా యస్.పి గారు తెలిపారు.


వార్తావాహిని