యూనిట్
Flash News
ఓపెన్ హౌస్
11వ పటాలము ఆవరణలో అమరుల వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఓపెన్ హౌస్
కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి బాకారపేట, బొగ్గిడివారి
పల్లి, పాలకొండ్రాయునిపల్లి, సిధౌట్
ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 330 మంది విద్యార్థులు,
ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమాండెంట్ ఎన్.శ్రీనివాసరావు
అధ్యక్షతన ఆయుధాల పనితీరు, పనిచేసే విధానం, పోలీసులు ప్రజారక్షణకు తీసుకునే చర్యల గురించి విద్యార్థులకు
క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో సిబ్బందితోపాటు, ఇతర
సీనియర్ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.