యూనిట్

ఓపెన్‌ హౌస్‌

పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా 3వ పటాలము అడిషనల్‌ కమాండెంట్‌ ఎం.నాగేంద్రరావు ఆధ్వర్యంలో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఓపెన్‌ హౌస్‌లో కాలేజి, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొని, ఆయుధాల పనితీరు, పోలీసు యొక్క ఆయుధ సామాగ్రిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు పటాలము సీనియర్‌ అధికారులు, అడిషనల్‌ కమాండెంట్‌ ఆయుధ పనితీరును వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఎస్‌.దేవానందరావు, ఆర్‌.ఐ.లు బి.రామకృష్ణ, బిఎస్‌పి శేఖర్‌రావు, ఎం.విల్సన్‌బాబు, సతీష్‌, సత్యనారాయణ, ఆర్‌.ఎస్‌.ఐ. రవితేజ, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని