యూనిట్
Flash News
విజయవాడ ట్రాఫిక్ క్రమబద్దీకరణకు నూతన పరికరాలు

దిన దినానికి
విపరీతంగా పెరిగిపోతున్న వియజయవాడ నగర ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడానికి నూతన
పరికరాలను విజయవాడ నగర పోలీస్ శాఖ కొనుగోలు చేసింది. పరికరాలను నగర ట్రాఫిక్
విభాగానికి నగర పోలీస్ కమీషనర్ సి. హెచ్ ద్వారకా తిరుమల రావు శనివారం అందజేశారు. ఈ
సందర్భముగా అయన మాట్లాడుతూ ట్రాఫిక్ పరికరాలు కొనుగోలు చేయడానికి కొంత బడ్జెట్ ను
కేటాయించిన దుర్గ గుడి ఈ ఓ సురేష్ బాబు కి కృతజ్ఞతలు తెలియజేసారు. కొనుగోలు చేసిన
ట్రాఫిక్ పరికరాలు కోన్స్ - 500 , రేడియం జాకెట్స్ -
120 ,
హ్యాండ్ గ్లోవ్స్ - 100 , స్టాండ్ బారికేడ్స్ - 50 , హెవీ బెరికేడ్స్ -
35 ,
వార్నింగ్ లైట్స్ - 25 , ఫోల్డింగ్
కొన్స్ - 22 లను ట్రాఫిక్ స్టేషన్స్ వారీగా అందజేశారు.