తేది.22.01.2020 న సాయంత్రం 6 గంటల నుండి
జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా యస్.పి.భాస్కర్ భూషణ్, AP ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిప్యూటి కమీషనర్ వి.రాధయ్య
మరియు వారి అధికారులతో పాటు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్, DRDA అధికారులతో జిల్లా పోలీస్ అధికారులు కలిసి పని చేసే విధి
విధానాల గురించి సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా యస్.పి. అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం
యొక్క మద్యం పాలసీ అనుసరించి జిల్లాలోని అన్నీ ప్రాంతాలలోని నాటు సారా, బెల్ట్ షాపులను పూర్తిగా అరికట్టే దిశలో తీసుకోనవలసిన చర్యలు, కల్తీ మద్యంను మరియు పన్ను కట్టని మద్యంను ఇతర రాష్ట్రాల
నుండి సరిహద్దులు దాటించడం , అక్రమ రవాణా, నిల్వలపై తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించారు. ఈ
సందర్భంగా ప్రజలు మద్యానికి బానిసలుగా మారకుండా ఉండటానికి ఇప్పటికే బానిసలు అయి
ఉన్న వారికీ డీ-అడిక్షన్ సెంటర్ లు నిర్వహణ గురించి కూడా చర్చించడం జరిగింది.ఈ సమావేశం లో పై అధికారులతో పాటు అసిస్టెంట్ కమీషనర్ P&Eమూర్తి, యస్.బి. డి.యస్.పి
యన్.కోటా రెడ్డి, ES లు- వెంకట రామణా
రెడ్డి,
శ్రీనివాస రావు, DLPO
నాగేశ్వరరావు, DRDA అధికారి శ్రీమతి కామాక్షి, DMHO అధికారి డా.రమాదేవి హాజరైనారు.