యూనిట్
Flash News
“అమరజీవి”కి ఘనంగా శ్రద్దాంజలి
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా 15.12.2019 ఉదయం 10.30 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ వద్ద గల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా యస్.పి. శ్రీ భాస్కర్ భూషణ్, IPS., గారు ఘనంగా నివాళులు అర్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారు తన ఆశయసాధనలో కఠోర నిర్ణయంతో 56 రోజులు దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడని, అందుకే గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం తెలుగువారు మరియు ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రజలు గర్వించదగ్గ విషయం అని ఈ సందర్భంగా జిల్లా యస్.పి. గారు తెలిపారు. అనంతరం కస్తూర్భా కళాక్షేత్రంలో ఏర్పాటు చేయబడిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలలో జిల్లా యస్.పి. గారు పాల్గొనడం జరిగినది. అనంతరం 11 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయం నందు శ్రీ పొట్టిశ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి, జిల్లా పోలీసు అధికారులతో కలిసి శ్రాద్దంజలి ఘటించారు. అనంతరం జిల్లా యస్.పి. గారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమర జీవి అయిన మహోన్నత వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు, ఆంధ్ర రాష్ట్ర అవతరణతో పాటు భారతదేశంలో బాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడయినాడని, హరిజనుల ఉద్దరణ, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పాత్ర అమోఘం అని జిల్లా యస్.పి. గారు ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్.పి.(ఏ.ఆర్) శ్రీ యస్.వీరభద్రుడు గారు, అడిషనల్ యస్.పి. (క్రైమ్స్) శ్రీ పి. మనోహర్ రావు గారు, యస్.బి. డి.యస్.పి. శ్రీ యన్.కోటారెడ్డి, డి.యస్.పి. (ఏ.ఆర్) శ్రీ వై. రవీంద్ర రెడ్డి, డి.యస్.పి.(HG) శ్రీ డి.శ్రీనివాస రావు గార్లు, ఆర్.ఐ. లు మౌలుద్దీన్, రమణయ్య, దర్గామిట్ట ఇన్స్పెక్టర్ శ్రీమతి యం.నాగేశ్వరమ్మ, డి.సి.ఆర్.బి. సి.ఐ. శ్రీ రామారావు గార్లు, ఆర్.యస్.ఐ. లు మరియు ఇతర సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.