యూనిట్

ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించిన నెల్లూరు జిల్లా ఎస్పీ

నెల్లూరు ట్రాఫిక్ మరియు టౌన్ పోలీసు అధికారులతో మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ డా.కె. తిరుమలేశ్వర రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. టౌన్ లోని ప్రతి ప్రాంతం గురించి కూలంకుషంగా చర్చిస్తూ, ట్రాఫిక్ రెగ్యులేషన్ ను క్షుణ్ణంగా వివరించి, మద్రాస్ బస్టాండ్, ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతాల ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేసారు. ప్రజల దృష్టి ఎక్కువగా ట్రాఫిక్ పోలీసుల విధులపైనే కేంద్రీకృతమై ఉంటుంది. ట్రాఫిక్ పోలీసుల విధినిర్వహణపై పోలీసు శాఖ యొక్క ప్రతిష్ట ఆధారపడి ఉంటుందన్నారు. ద్విచక్ర వాహనలు రాంగ్ రూట్ లలో వెళ్ళడం, అనధికార పార్కింగ్ లను సహించేది లేదు  ఉల్లంఘించిన వారిపై ఈ-చలానా ద్వారా జరిమానాలు విధించాలని ఆదేశాలు జారీ చేసారు. నెల్లూరు నగర జనాభా పెరుగుదల, వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వలసలు, వాణిజ్య ప్రాంతం కావడం వలన నిత్యం వివిధ ప్రాంతాల నుండి ప్రజలు రాకపోకలు, విద్యాసంస్థల కేంద్రంగా ఉండటం తదితర కారణాల వల్ల ట్రాఫిక్ నిర్వహణ అంశం ఒక సవాలుగా ఉంటుందన్నారు.  ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. సిబ్బంది కొరత లేదా మౌళిక సదుపాయాలు తదితర సమస్యలు ఉంటే తెలపాలని సూచించారు.

వార్తావాహిని