యూనిట్

నెల్లూరు జిల్లా పోలీస్ డైరీ 2020 ఆవిష్కరణ

నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్, చేతులమీదుగా  ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీస్  అసోసియేషన్ తరుపున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధి గా విచ్చేసి "పోలీస్ డైరీ 2020" ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ సంపూర్ణ సమాచారం కలిగి ఉన్న ఈ డైరీ రోజువారీ దైనందిన  కార్యకలాపాలలో పోలీస్ సిబ్బంది ఎంతగానో ఉపయోగపడుతుందని  డైరీ  2020 తయారీకి కృషి చేసిన వారి నందరిని అభినందించారు.

జిల్లా పోలీస్ యూనిట్ అంతా కూడా ఒక "కుటుంబం" అని అందరము  క్రమ శిక్షణతో  మెరుగైన సేవలు ప్రజలకు అందిస్తామని, క్రమ శిక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని, ఉద్యోగ నిర్వహణలో ఎలాంటి బయట వత్తిడిలకు  తావివ్వమని, రాబోయే రోజుల్లో జిల్లా పోలీసు అసోసియేషన్ సభ్యుల సూచనలు సలహాలు తో పోలీస్ సంక్షేమంపై మరింత దృష్టి  పెడతామని ఈ సందర్భంగా తెలుపుతూఅన్ని కార్యక్రమాలలో ఎంతగానో సహకరిస్తున్న మీడియా మిత్రులను యస్.పి గారు అభినందించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షులు మద్దిపాటి ప్రసాద్ గారు మాట్లాడుతూ 15 సం క్రితం రాష్ట్రంలోనే మొదటి సారిగా నెల్లూరు జిల్లాలో పోలీసు డైరీ ప్రారంభం అయ్యింది అనిపూర్తి అప్డేటెడ్ సమాచారంతో డైరీ పూర్తి కావడానికి సహాయ సహకారాలు అందించిన జిల్లా ఎస్పీ గారికి, పోలీసు కార్యాలయ కార్య వర్గ సభ్యులుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గంగాధర్ మాట్లాడుతూ యస్.పి గారు సిబ్బంది సంక్షేమం విషయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో రాష్ట్రంలోనే నంబర్ వన్ గా నిలిచారని అదే విధంగా మన జిల్లాలో కూడా కొనసాగిస్తారని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు మొత్తం  అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులును   అభినందిస్తూ వారికి మరియు అడిషనల్ యస్.పిలుమనోహర్ రావువీర భద్రుడు, డిపిఓ పే  సూపరింటెండెంట్ శ్రీమతి షేక్ ఖతీజ బేగం గార్లకు మెమోంటోలు అందచేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మౌలుద్దీన్, కార్యదర్శి జయరాజ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు శ్రీనివాసులురెడ్డిరఫీ, కృష్ణ మోహన్, పెంచల ప్రసాద్, శ్రీమతి ఝాన్సీ ప్రసన్న మరియు మీడియా మిత్రులు సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని