యూనిట్
Flash News
రాష్ట్ర సరిహద్దుల్లో పరస్పర సహకారం అవసరం

ఎర్రచందనం సంపద ఉన్న సరిహద్దు రాష్ట్రాల మధ్య పోలీసుల పరస్పర సహకారం ఎంతో అవసరమని రెడ్‌శాండల్ టాస్క్‌ఫోర్స్ ఐజిపి డా||ఎం.కాంతారావు అన్నారు. ఎర్రచందనం కలిగి ఉన్న జిల్లాలు తిరుపతి, కర్నూలుతోపాటు తమిళనాడు రాష్ట్ర పోలీసులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజిపి మాట్లాడుతూ రెడ్‌శాండర్స్ రక్షణలో భాగంగా ఆయా జిల్లాల పరిధిలో జరిగిన అరెస్టులు, ఎర్రచందనం దుంగలు స్వాధీనం తదితర వాటిపై కేసులు, వాటి పరిష్కారాలు అమలుకు నోచుకోకుండా ఉన్నవాటిపై దృష్టి కేంద్రీకరించి త్వరగా పరిష్కారమయ్యేలా ఒకరినొకరు సహకారం అందించుకోవాలని పిలుపునిచ్చారు. ఇదే సందర్భంలో టాస్క్‌ఫోర్స్ టీమ్, అటవీశాఖ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించి సంపదను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రెడ్‌శాండర్స్ టాస్క్‌ఫోర్స్ అధికారులు, డిఎస్‌పిలు, అటవీ శాఖ జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.