యూనిట్

శాంతిభద్రతల పరిరక్షణలో పటిష్టంగా ఉండాలి: కర్నూలు రేంజ్ డిఐజి

 ప్రతి సంవత్సరం జరిగే వార్షిక తనిఖీలలో భాగంగా గురువారం ఉదయం స్దానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆర్మడు రిజర్వుడు హెడ్ క్వార్టర్ ను కర్నూలు రేంజ్ డిఐజి   పి. వెంకటరామి రెడ్డి , జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ లు కలిసి తనిఖీ చేశారు. ఈ సంధర్బంగా కర్నూలు రేంజ్ డిఐజి  మాట్లాడుతూ జిల్లా పోలీసు యంత్రాంగం  పంచాయితీ ఎన్నికలకు సిద్దంగా ఉండాలన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఒక టీమ్ గా పని చేసి చక్కటి పనితీరు కనబరచి జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు.  అనంతరం తనిఖీల్లోభాగంగా బెల్లాఫాం (ఆయుధాగారం), డాగ్ స్క్వాడ్, క్యాష్ బుక్స్, స్పెషల్ పార్టీ ఆఫీస్, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అన్ని రికార్డులను డిఐజి పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ   ఎమ్. కె రాధాక్రిష్ణ , డిఎస్పీలు  ఇలియాజ్ భాషా, ఆర్ ఐలు   రామక్రిష్ణ,   జార్జ్,    రాధాక్రిష్ణ, శివారెడ్డి,  సురేందర్  రెడ్డి, ఆర్ ఎస్సైలు, ఎఆర్ సిబ్బంది, డిఐజి   పిఎ   రత్న ప్రకాష్ ఉన్నారు. 

వార్తావాహిని