యూనిట్

తల్లిని దూషించాడనే హత్య చేశాడు

కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ హాస్టల్లో వుంటూ మూడో తరగతి చదువుతున్న దాసరి ఆదిత్య హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించినట్టు ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు తెలిపారు. ఎఎస్పీ ఎం. సత్యబాబు ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు కేసును దర్యాప్తు చేశారని తెలిపారు. కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. తన తల్లిని దూషించాడన్న కారణంతో అదే హాస్టల్‌లో ఉంటున్న పదవ తరగతి విద్యార్థే, ఆదిత్యను హత్య చేసినట్లు తెలిపారు. రెండురోజుల క్రితం హాస్టల్‌లో బట్టలు ఉతుకుతున్న ఆదిత్యకు, పదవ తరగతి విద్యార్థికి మధ్య చిన్న గొడవ జరిగిందని, ఈ నేపథ్యంలో మాటా మాటా పెరిగి ఆదిత్య, పదవ తరగతి విద్యార్థిని దుర్భాషలాడారని, ప్రతి చిన్న విషయాన్ని సెన్సిటివ్‌గా తీసుకునే సదరు విద్యార్థి.. ఆదిత్య మాటలను మనసులో పెట్టుకొని ఎలాగైనా అతన్ని హత్య చేయాలని భావించాడని ఎస్పీ తెలిపారు. ఆదిత్య పక్కనే పడుకున్న పదోతరగతి విద్యార్ధి ఆర్ధరాత్రి నిద్రలేపి బయటకు తీసుకు వెళ్ళాడు. బక్కెట్‌ పోయిందని వెదుకుదామని డాబాపైకి తీసుకు వెళ్ళి మొదటి ప్రయత్నంలో చంపేందుకు ప్రయత్నించగా ఆదిత్య కేకలు వేయడంతో విఫలమై బాత్‌రూమ్‌కి తీసుకు వెళ్ళి జేబులో వుంచుకున్న పెన్సిల్‌ చెక్కే చాకుతో మెడపై విచక్షణా రహితంగా గాయపరిచి హత్య చేసినట్లు పేర్కొన్నారు. తర్వాత చాకు కడిగి, బట్టలు మార్చుకుని గోడ దూకి బయటకు వెళ్ళి పడుకుని ఉదయం తిరిగి వచ్చి అప్పుడే వచ్చినట్లు క్రియేట్‌ చేశాడు. ఆదిత్య హత్యకు ఉపయోగించిన కత్తిని, బట్టలను డాగ్‌ స్క్వాడ్‌ పసిగట్టడంతో, హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకొని సైకాలజీ కౌన్సెలింగ్‌ నిర్వహించాం. హత్య చేసిన విద్యార్థి తండ్రికి నేర చరిత్ర ఉన్నట్లు తెలిసింది. ఇప్పటి పిల్లలపై సోషల్‌ మీడియా చాలా ప్రభావం చూపిస్తుంది. హత్య చేసిన తర్వాత ఎలా జాగ్రత్త పడాలో సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు' అని ఎస్పీ తెలిపారు.

వార్తావాహిని