యూనిట్
Flash News
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: తూర్పు గోదావరి ఎస్పీ

సోషల్ మీడియా
ద్వారాలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని
తూర్పుగోదావరి ఎస్పీ అద్నాన్ నయిం అస్మి అన్నారు. శనివారం కాకినాడ లోని తన
కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం మాట్లాడారు. పిఠాపురం పట్టణంలో ఈ నెల 20 న
రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హిందూ దేవుళ్ళ విగ్రహాలను ద్వంసం చేసారు. ఈ విషయం
పై పోలిసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
కేసు దర్యాప్తులో ఉన్నప్పుడే కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
చేస్తున్నారని పేర్కొన్నారు. దేవత విగ్రహాలపై మల మూత్రాలను వేశారని తప్పుడు
ప్రచారం చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చింది అన్నారు. ఇటువంటి పుకార్లను ప్రజలు
నమ్మవద్దు అని ఎస్పీ విజ్ఞప్తి చేసారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి ప్రజలను
తప్పుడు ద్రోవ పట్టించడమే కాక వర్గాల మధ్య మతం ప్రాతిపదికన విభేదాలు సృష్టించి
రెచ్చగొట్టేవిధంగా పుకార్లను సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ
హెచ్చరించారు.