యూనిట్

మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎస్పీ

  శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని ఆర్మ్ డ్ రిజర్వ్‌ కార్యాలయం ఆవరణలో వున్న పోలీస్‌ క్వార్టర్స్ నందు  మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను జిల్లా ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా వుండాలంటే రక్షిత నీరు తీసుకోవడం అవసరమన్నారు. ప్రతి ఒక్కరు మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను వినియోగించుకుని సురక్షితమైన నీటిని పొందాలని కోరారు. అనంతరం క్వార్టర్స్ లో నిర్వహిస్తున్న మెడికల్‌ యూనిట్‌ను పరిశీలించి వైద్యుడు బి.ప్రసన్నకుమార్‌తో మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి.గంగరాజు, డిఎస్పీ ఎం.ఎస్‌.ఎస్‌.శేఖర్‌, ఆర్‌ఐలు కోటేశ్వరబాబు, రవికుమార్‌, ఎం.ఎన్‌.మూర్తి తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని