యూనిట్
Flash News
ప్రతిభావంత విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు
ప్రతిభావంత విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు కర్నూలు జిల్లా పోలీసుశాఖలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల పిల్లలు ఇటీవల నిర్వహించిన పలు తరగతుల వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించారు. వారిలో నీట్‌లో 17 మందికి, ఐఐటీలో ముగ్గురు సీట్లను సంపాదించారు. వీరికి ప్రోత్సాహకరంగా సంక్షేమ నిధి నుండి ఒక్కొక్కరికి ప్రోత్సహాకంగా రూ.50 వేల చెక్కులు అందజేశారు.ఇటీవల విడుదలైన ప్రతిభా పరీక్షల్లో 36 మంది మెరిట్ స్కాలర్ షిప్‌లకు ఎంపికయ్యారు. ఒక్కో విద్యార్థి ప్రతిభ ఆధారంగా రూ.5 వేల నుండి 20 వేల వరకు స్కాలర్ షిప్‌లు అందజేసినట్లు డిఐజి వెంకటరామిరెడ్డి తెలిపారు. రాష్ట్ర గౌరవ డీజీపీగారి ద్వారా మంజూరు చేయబడిన మెరిట్ స్కాలర్ షిప్ లను పోలీసుకుటుంబాల పిల్లలకు డిఐజి, ఎస్పీలు అందజేశారు. డిఐజి మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు. మంచి సాహిత్య నవల పుస్తకాల గురించి చదివి అందులో ఉన్న సత్యాలను తెలుసుకోవాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ...పోలీసు సంక్షేమ నిధి నుండి ఎంబీబీస్ , ఐఐటిలో మంచి ర్యాంకులు సాధించిన వారికి పోలీసు పిల్లల బ్యాంకు ఖాతాల పేరు మీదనే 50 వేల రూపాయల చెక్కులను అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు శ్రీమతి దీపికా పాటిల్, ఓయస్డీ ఆంజనేయులు, అడిషనల్ ఎస్పీ రాధక్రిష్ణ, డీిఎస్పీ డివి రమణమూర్తి, సిఐ మహేశ్వరరెడ్డి, ఎఓ సురేష్ బాబు, ఎస్పీ పీఏ రంగస్వామి, ఆర్‌ఐలు రామక్రిష్ణ, రంగముని, పోలీసు సంఘం అధ్యక్షులు నాగరాజు, బి.సూపరింటెండ్ కుమారి దేవి పాల్గొన్నారు.