యూనిట్

ఆశ్రమ పాఠశాలలో మెగా వైద్యశిబిరం

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొత్తూరు అశ్రమ పాఠశాలలో పోలీస్‌ శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన మెగా వైద్యశిబిరంను జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి ప్రారంభించారు. పలాస, మందస మండలాలకు చెందిన గిరిజనులు అత్యధికంగా హజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పలాస - కాశీబుగ్గ జంటపట్టణాలతో పాటు శ్రీకాకుళం జెమ్స్‌ ఆసుపత్రి వైద్యలు హజరై గిరిజనులకు వైద్య పరీక్షలు జరిపారు. వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. క్యాక్రమంలో గిరిజన బాలికలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో కాశీబుగ్గ డిఎస్పీ శివరామి రెడ్డి, సి.ఐలు వేణుగోపాల్‌, వినోద్‌బాబు, శ్రీనివాసరావు, నీలయ్య, లొత్తూరు మాజీ సర్పంచ్‌ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని