యూనిట్
Flash News
కావలిలో పోలీస్ నివాస సముదాయాల నిర్మాణానికి చర్యలు
కావలిలో
పోలీస్ నివాస సముదాయాల నిర్మాణానికి చర్యలు నెల్లూరు నుండి అమరావతి వెళుతూ మార్గ
మధ్యంలో కావాలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆహ్వానంపై వారి
నివాసానికి హోంమంత్రి శ్రీమతి మేకతోటి సుచరితగారు వచ్చారు. ఈ సందర్భంగా కావలి
పరిధిలోని పోలీస్‌స్టేషన్స్, వాటి
వ్యవస్థాగత సమస్యలను వివరించారు. కావలి పట్టణంలోని పోలీస్ నివాస సముదాయ భవనాలు
పూర్తి శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటి స్థానే నూతన
సముదాయాలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఉన్నదని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన
హోంమంత్రి ఈ విషయాన్ని వెంటనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
గారి దష్టికి తీసుకెళతానని, నివాస సముదాయాల నిర్మాణానికి
కషి చేస్తానని హామీ ఇచ్చారు. పోలీస్ నివాస సముదాయాల నిర్మాణంపై హోంమంత్రి
తక్షణమే స్పందించి హామీ ఇవ్వడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.